మలయాళ చిత్ర సీమలో ఎన్నోసూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపుని పొందిన నటుడు సురేష్ గోపి(suresh gopi)తెలుగులోకి  కూడా ఆయన సినిమాలు రీమేక్ అయ్యి మంచి ప్రేక్షాదరణని పొందాయి.అదే విధంగా మలయాళ ముద్దు గుమ్మఅనుపమ పరమేశ్వరన్(anupuma parameswaran)కూడా తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తన కంటూ ఒక ప్రత్యేకతని సంపాదించుకుంది.మొన్నీ ఈ మధ్యనే టిల్లు స్క్వేర్ తో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.

ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో యదార్థ సంఘటనల ఆధారంగా’జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'(janaki v/s state of kerala)అనే సినిమా తెరకెక్కింది.తనకి జరిగిన అన్యాయాన్ని జానకి  కోర్టులో ఎలా ఎదుర్కొంది అనే పాయింట్ తో కోర్టు  ఇంటెన్స్ డ్రామాగా తెరకెక్కగా,టైటిల్ రోల్ జానకి క్యారక్టర్ ని  అనుపమ పరమేశ్వరన్ పోషిస్తుంది.లాయర్ గా సురేష్ గోపి కనిపించనున్నారు. 

ప్రవీణ్ నారాయణ దర్శకత్వంలో కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ పై ఫణీంద్ర కుమార్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కగా బైజు సందోష్,మాధవ్ సురేష్ గోపి,దివ్య పిళ్లయి,అస్కర్ అలీ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.సేతురామన్,హుమాయున్ అలీ అహమ్మద్ సహా నిర్మాతలుగా వ్యవహరించగా రెనదివ్ ఫోటోగ్రఫిని, జిబ్రాన్ సంగీతాన్ని,ఎడిటర్ సంజిత్ మహమ్మద్ పిఆర్ఓ : మధు VR.ఫిబ్రవరిలో విడుదల చేస్తామని  మేకర్స్ తాజాగా అనౌన్స్ చెయ్యడం జరిగింది.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here