ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​గా కొనసాగుతోంది ఏథర్​ రిజ్టా. 2024 తొలినాళ్లల్లో లాంచ్​ అయిన ఈ ఈ-స్కూటర్​ ధరలను తొలిసారి పెంచుతోంది సంస్థ. జనవరి 1, 2025 నుంచి కొత్త రిజ్టా ధర పెరుగుతుందని డీలర్లు హెచ్​టీ ఆటోకు స్పష్టం చేశారు. ప్రస్తుత ధరల కంటే రూ.5,000 నుంచి 6,000 వరకు పెరిగే అవకాశం ఉందని వివరించారు. ప్రస్తుతం మార్కెట్​లో ఏథర్​ రిజ్టా ఎలక్ట్రిక్​ స్కూటర్​ రూ .1.10 లక్షలు- రూ .1.46 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంది. ధరల పెంపునకు ముందే కొనుగోలు చేస్తే డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ వెహికిల్​ ఫీచర్స్​, రేంజ్​ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here