జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు
గూగుల్ (google) తన ప్రధాన వ్యాపారాల్లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను చొప్పించడం ద్వారా ఇతర ఏఐ కంపెనీలను ఎదుర్కొంటోంది. ఓపెన్ఎఐ వంటి ఏఐ సంస్థల దూకుడును అధిగమించడానికి గూగుల్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగానే, కొత్త ఏఐ వీడియో జనరేటర్, దాని ఆలోచనా విధానాన్ని చూపించే “రీజనింగ్” మోడల్తో సహా కొత్త జెమినీ మోడళ్లను ప్రారంభించింది. ఆధునిక గూగుల్ కోసం అప్డేట్ చేయాల్సిన అవసరం ఉందని బుధవారం జరిగిన స్టాఫ్ మీటింగ్ లో సుందర్ పిచాయ్ సిబ్బందికి చెబుతూ “గూగ్లీనెస్ (Googleyness)” అనే పదం యొక్క అర్థాన్ని కూడా వివరించారు.