చలికాలంలో గోంగూర తినడం అత్యవసరం. దీనిలో మన శరీరానికి అత్యవసరమైన విటమిన్ ఏ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఇనుము వంటివి అధికంగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. రేచీకటి వంటివి రాకుండా ఇది అడ్డుకుంటాయి. అలాగే దృష్టి సమస్యలు రాకుండా కూడా అడ్డుకుంటాయి. గోంగూరను ఆహారంలో భాగం చేసుకుని తినడం చాలా అవసరం. దీనిలో ఉండే పోషకాలు మన బరువు తగ్గించేందుకు కూడా సహాయపడతాయి. వీటిలో క్యాలరీలు, కొవ్వు చాలా తక్కువగా ఉంటాయి. తరచూ గోంగూర తినడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. గుండెకి సంబంధిత వ్యాధులు కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకునే శక్తి గోంగూరకు ఉంది.