రుణ మొత్తాన్ని తనిఖీ చేయండి..
ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు, మీకు వాస్తవంగా అవసరమైన రుణ మొత్తాన్ని అంచనా వేయండి. ఇతర రుణాల మాదిరిగానే, ఈ తక్షణ వ్యక్తిగత రుణాన్ని భవిష్యత్తులో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి, ఎల్లప్పుడూ మీపై ఆర్థిక ఒత్తిడి లేకుండా మీరు తరువాత తిరిగి చెల్లించగల మొత్తాన్ని మాత్రమే రుణంగా తీసుకోండి. అధిక రుణభారం, తక్కువ క్రెడిట్ స్కోర్, పేలవమైన ఆర్థిక పరిస్థితులు, నెలవారీ చెల్లింపులకు నగదు ప్రవాహ సమస్యలు వంటివి మీపై ఒత్తిడిని పెంచుతాయి.