కాశీని మృత్యు నగరం అని ఎందుకు అంటారు?
కాశీకి ఎంతో విశిష్టత ఉంది. వేదాల్లో, పురాణాల్లో, రామాయణ, మహాభారతంలో కూడా వర్ణించడం జరిగింది. పైగా కాశీని మోక్షాన్ని ఇచ్చే నగరం అని కూడా అంటారు. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చనిపోతారు. జీవితంలో పుట్టుక, చావు రెండు కూడా పెద్ద నిజాలు. ఎవరైనా చనిపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎంతో బాధపడతారు. కానీ కాశీలో చనిపోతే సంతోషపడతారు. కాశీలోని ముముక్ష భవన్ లో దాదాపు 80 నుంచి 100 మంది ఉంటున్నారు. చనిపోవడం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ముమోక్ష భవనం 1920ల నుంచి వారణాసిలో ఉంది. శివుడు కొలువై ఉన్న వారణాసిలో ఎవరు చనిపోయిన లేదా ఎవరి అంతిమ సంస్కారాలు ఇక్కడ జరిపినా వారు జనన, మరణ చక్రం నుంచి విముక్తిని పొందుతారు.