రైతులకు ఏపీ ప్రభుత్వం అప్‌డేట్ ఇచ్చింది. పంటల బీమా ప్రీమియం చెల్లింపునకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. బీమా ప్రీమియంను చెల్లించేందుకు గడువు ఈనెల 15తో ముగిసింది. అయితే ఇంకా చాలా మంది రైతులు బీమా ప్రీమియంను చెల్లించకపోవడంతో గడువును ఈనెల 31 వరకు పెంచినట్లు అధికారులు తెలిపారు.