తెలంగాణకుఇదేమిఖర్మ!
ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు భూమి కేటాయించాలనే నిర్ణయంపై తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులు అభ్యతంరం చెబుతున్నారు. తెలంగాణకు ఇదేమి ఖర్మ అంటూ నిరసన చెబుతున్నారు. డెబ్భై ఏండ్ల పైబడ్డ తెలంగాణ ఉద్యమంలో ఇంతకంటే ఘోరమైన సంఘటన మరొకటి లేదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వ చర్యను”తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల వేదిక” తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. భూమి కేటాయించాలనే ప్రభుత్వం పునరాలోచించకుంటే అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి “తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల వేదిక” పెద్ద ఎత్తున ఉద్యమిస్తదని ప్రకటించింది.