నేతల నివాళులు
హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలాకు వివిధ రాజకీయ పార్టీల నేతలు నివాళులు అర్పించారు. ఓం ప్రకాశ్ చౌతాలా సేవలను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ అన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (chandrababu naidu) కూడా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ‘ఐఎన్ఎల్డీ అధినేత, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. సీనియర్ నాయకుడు, రాజనీతిజ్ఞుడు అయిన ఆయన తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసి హర్యానా (haryana news) రాజకీయ ముఖచిత్రాన్ని తీర్చిదిద్దారు. ఆయన చేసిన సేవలు, వారసత్వం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన కుటుంబానికి, ఆత్మీయులకు, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.