అనంతపురం జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. రైతుల వద్ద కందులు కొనుగోలు చేసే క్రమంలో వ్యాపారస్తుల చేతివాటం ప్రదర్శించారు. ఎలక్ట్రానిక్ కాటాలలో రిమోట్ కంట్రోల్ చిప్ అమర్చి తూకంలో మోసం చేశారు. రైతులు ఈ విషయాన్ని పసిగట్టారు. వెంటనే వ్యాపారస్తులను నిలదీయటంతో కందులు కొనుగోలు చేసిన వజ్రకరూరు మండలం చాబాలలో లారీ వదిలి పరారయ్యారు.