TGSWREIS Admissions: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోన్న సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, గురుకుల విద్యాలయ సంస్థల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS, TGREIS విద్యా సంస్థల ఆధ్వర్యంలో పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశమునకై 2025 – 26 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన వెలువడింది.