ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు ప్రొటీన్లు శరీరానికి అందించే “బనానా బ్రెడ్ ఫిట్టారా” (అరటిపండుతో బ్రెడ్) వంటకం రుచితో పాటు శరీరానికి మంచిది కూడా. పేరులో ఉన్నట్లుగానే ఫిట్టారా అంటే గుడ్లతో తయారుచేసేది అని. బాగా రంగు వచ్చి, నల్ల మచ్చలు వచ్చిన అరటిపండు కాకుండా దోరగా ఉండేది తీసుకోవడం బెటర్. ఇది బాగా తియ్యగా అనిపించదు కూడా. హెల్తీగానూ, టేస్టీగానూ అనిపించే ఈ వంటకం మీకు బ్రేక్ ఫాస్ట్‌కు మంచి ఛాయీస్. ఇంట్లో అందరూ తినే విధంగా, టేస్టీగా ఉండే బనానా బ్రెడ్ రెసీపీని ఇంట్లోని ఒక నలుగురైదుగురు వ్యక్తులకు సరిపోయేలా తయారుచేసుకోవడానికి ఈ పదార్థాలు తీసుకోండి.