మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి(vijay sethupathi)హీరోగా వర్సటైల్ డైరెక్టర్ వెట్రిమారన్(vetri maaran)దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ విడుదల పార్ట్ 2(vidudala part 2).డిసెంబర్ 20న వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ మూవీలో మంజువారియర్(manju warrier)సూరి, ఇలయవరసు,గౌతమ్ మీనన్,రాజీవ్ మీనన్,అనురాగ్ కశ్యప్ తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించగా భారతీయ చిత్ర పరిశ్రమకి గర్వకారణమైన ఇళయరాజా సంగీతాన్ని అందించాడు.

ఇక ఈ మూవీ తొలి రోజు కలెక్షన్స్ ని చూసుకుంటే తమిళ లాంగ్వేజ్ లో 6 .6 కోట్లు,తెలుగులో నలభై లక్షల రూపాయల నెట్ కలెక్షన్స్ తో మొత్తం 7 కోట్లని వసూలు చేసింది.ఇక అన్ని ఏరియాల్లో ఆక్యుపెన్సీ పరంగా చూసుకుంటే మార్నింగ్ షో ఒక మాదిరిగా ఫుల్ అయినా కూడా మాట్నీ నుంచి అన్ని చోట్ల కూడా  ఫుల్ అవ్వడం జరిగిందని సినీ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

ఆర్ఎస్ ఇన్ఫోటైన్మేంట్,శ్రీ వేదాక్షర మూవీస్ పతాకంపై కుమార్,రామారావు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ అణగారిన వర్గాల వారి హక్కులని  కొంత మంది జమీందారులు ఏ విధంగా అణగతొక్కుతున్నారో చూపించడం జరగగా అభ్యుదయ భావాలు కలిగిన పెరుమాళ్ క్యారక్టర్ లో విజయ్ సేతుపతి తన నట విశ్వరూపాన్ని చూపించాడనే మాటనే అభిప్రాయాన్ని చాలా మంది ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here