మంత్రులు, సీఎంలు హాజరు
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరితో పాటు పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు, కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (CBIC) అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రుల బృందం మధ్య చర్చల తరువాత మరింత సమీక్ష అవసరమని పేర్కొంటూ బీమా (insurance) సంబంధిత జిఎస్టి మార్పులకు సంబంధించిన నిర్ణయాలను వాయిదా వేయాలని కౌన్సిల్ నిర్ణయించినట్లు వివిధ మీడియా నివేదికలు తెలిపాయి. దీనిపై మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉందని కొందరు సభ్యులు చెప్పారు. మేము (GoM) జనవరిలో మళ్లీ సమావేశమవుతాము” అని బీమాపై జివోఎంకు నేతృత్వం వహిస్తున్న బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి చెప్పారు.