శాంతాక్లాజ్, గిఫ్ట్ లు అంటూ పిల్లలు ఎంతో ఆశగా ఎదురుచూసే క్రిస్టమస్ ఇంకొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. ఏసుక్రీస్తు జననాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేమ, ఉత్సాహంతో ప్రతి సంవత్సరం డిసెంబర్ 25నే ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున పిల్లలు తమ ప్రియమైన శాంతా వస్తాడని ఆత్రుతగా ఎదురుచూస్తారు. ఇది ఎరుపు రంగు దుస్తుల్లో వచ్చి చాలా బహుమతులను తెస్తాడని నమ్ముతారు. ఇంకా చాలా వరకూ ప్రజలు చర్చికి వెళతారు, ఇంటిని ప్రత్యేకంగా అలంకరించుకుంటారు. ఇంటికి స్నేహితులను పిలుచుకుని కుటుంబ సభ్యుల మధ్య ఆనందోత్సాహాలతో కేకులు కట్ చేసి క్రిస్మస్ పార్టీని సెలబ్రేట్ చేసుకుంటారు.