ఆధ్యశ్రీ ఇన్ఫోటైన్‌మెంట్‌లో భాగమైన శ్రేయాస్ మీడియా మహా కుంభ మేళాలో వెండింగ్ జోన్‌లు, అమ్యూజ్‌మెంట్ జోన్, ఫుడ్ కోర్ట్‌తో సహా పలు ఇతర కార్యకలాపాల హక్కులను సైతం దక్కించుకుంది. రూ.6,300 కోట్ల అంచనా బడ్జెట్‌తో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభ మేళా నిర్వహిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల మంది భక్తులను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఆకర్షిస్తుందని అనుకుంటున్నారు. 4,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ మెగా ఈవెంట్ జరుగుతుంది. భారతీయ కంపెనీలు కుంభ మేళా సందర్భంగా ప్రకటనలు, బ్రాండింగ్‌కు సుమారు రూ.3,000 కోట్లు వెచ్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Home International మహా కుంభ మేళా ప్రకటనల హక్కులు శ్రేయాస్ మీడియాకు.. కోట్లాది మందికి కనెక్ట్ అయ్యేలా ప్లానింగ్!-shreyas...