పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎంగా తన వంతు బాధ్యతలని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు.పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం మన్యం జిల్లాల్లో పర్యటిస్తున్న పవన్ ప్రభుత్వం యొక్క విధివిధానాలని వెల్లడి చేస్తూ సరికొత్త హామీలని కూడా ఇవ్వడం జరుగుతుంది.
రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొన్న పవన్ అక్కడి ప్రజలని ఉద్దేశించి మాట్లాడుతు సినీ పరిశ్రమ ఏపికి కూడా రావాలని కోరుకుంటున్నాను.వీళ్లెవరో బయట దేశాలకి వెళ్తా ఉన్నారు.ఆ డబ్బులు కనుక ఇక్కడికొస్తే ఇక్కడున్న ఆడపడుచులకు గాని,వేరే వాళ్ళకి గాని ఒక రోజు షూటింగ్ కి వెళ్తే డబ్బులు వచ్చేస్తాయని చెప్పుకొచ్చాడు.పవన్ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే పవన్ ప్రస్తుతం హరిహరవీరమల్లు(hari hara veeramallu)సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరో పక్క షూటింగ్ కూడా డేట్స్ ని కేటాయిస్తున్నాడు.మార్చి 28 న వరల్డ్ వైడ్ గా వీరమల్లు విడుదల కానుంది.పవన్ అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ లో ఉన్న ఓజి(og)ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh)లలో ఓజీ షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభం అయ్యింది.ఈ రెండు కూడా ఏపి లోనే షూటింగ్ ని జరుపుకుంటున్నాయి.