సంధ్య థియేటర్ లో పుష్ప 2 మూవీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఓయూ జేఏసీ నేతలు ఆదివారం అల్లు అర్జున్ ఇంటిపై దాడికి వెళ్లారు. ఇంట్లోకి దూసుకెళ్లి పూల కుండీలు పగులగొట్టారు. దీనిపై అల్లు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల్ని అరెస్టు చేసి ఇవాళ కోర్టులో హాజరుపర్చారు. విచారణ అనంతరం జడ్జి వీరికి బెయిల్ మంజూరు చేశారు.