హింసాత్మకంగా, క్రూరంగా..
మార్కో సినిమాలో హింసాత్మకమైన, క్రూరమైన సీన్లు ఎక్కువగా ఉన్నాయని ఈ చిత్రం చూసిన నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. మనుషులను, జంతువులను చంపే సీన్లు కొన్ని క్రూరంగా అనిపిస్తాయని అంటున్నారు. మహిళలు, పిల్లలను చంపే సీన్లు కూడా భయానకంగా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. వైలెన్స్ విషయంలో యానిమల్, కిల్ చిత్రాన్ని మార్కో దాటేసిందని అభిప్రాయపడుతున్నారు.