మీడియా ప్రతినిధులపై దాడికేసులో సినీ నటుడు మోహన్‌బాబుపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మోహన్‌బాబు. ఈ బెయిల్ పిటీషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో మోహన్‌బాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు పుకార్లు వచ్చాయి. అయితే తాను ఎక్కడికి వెళ్లలేదని మోహన్ బాబు ఇటీవల వివరణ ఇచ్చారు. మంచు ఫ్యామిలీలో మొదలైన ఆస్తుల వివాదం రచ్చకెక్కిన విషయం తెలిసిందే. మోహన్‌బాబు, మనోజ్ ఒకరిపై ఒకరు పోలీస్ కేసులు పెట్టుకున్నారు. మనోజ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు డీజీపీకి లేఖ రాశారు. ఏడు నెలల తన కూతురిని చూడనివ్వకుండా, ఇంట్లో అడుగుపెట్టకుండా తండ్రి మనుషులు తనను అడ్డుకుంటున్నారని, తనపై దాడులు చేశారంటూ మంచు మనోజ్ మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.