1976లో వచ్చిన మంథన్, 1977లో వచ్చిన భూమిక: ది రోల్, 1978లో వచ్చిన జునూన్, 1982లో వచ్చిన ఆరోహణ్, 2004లో వచ్చిన నేతాజీ సుభాష్ చంద్రబోస్: ది ఫర్‌గాటెన్ హీరో, 2010లో వచ్చిన వెల్డన్ అబ్బాలాంటి సినిమాలకు అవార్డులు వచ్చాయి. పుట్టిన రోజులు జరుపుకునేంత గొప్పగా తాను చేసిందేమీ లేదని ఈ మధ్యే తన 90వ పుట్టిన రోజు సందర్భంగా పీటీఐతో మాట్లాడుతూ శ్యామ్ బెనెగల్ అన్నారు. 2023లో వచ్చిన ముజీబ్: ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్.. ఆయన తీసిన చివరి సినిమా. ఇక ఒకప్పుడు సంచలనం సృష్టించిన మూవీ మంథన్ ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. వర్గీస్ కురియన్ శ్వేత విప్లవం ఆధారంగా తెరకెక్కించిన మూవీ ఇది. నసీరుద్దీన్ షా, స్మితా పాటిల్ నటించారు.
Home Entertainment Shyam Benegal Dies: ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత.. 90వ పుట్టినరోజు జరుపుకున్న కొన్ని...