ఎంజీ సైబర్‌స్టర్ 8-లేయర్ ఫ్లాట్ వైర్ వైండింగ్, వాటర్‌ఫాల్ ఆయిల్-కూల్డ్ మోటార్‌ను కలిగి ఉంది. దీనితో మోటారు అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా సరిగ్గా పని చేస్తుంది. ఇది కారు శక్తి, సామర్థ్యం, విశ్వసనీయతను పెంచుతుంది. సైబర్‌స్టర్ ఈవీ సస్పెన్షన్ గురించి చూస్తే.. ఇది ముందు భాగంలో డబుల్ విష్బోన్, వెనుక భాగంలో ఫైవ్ లింక్ ఇండిపెండెంట్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది. ఇది కారు రైడ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. రోడ్డుపై కారు సాఫీగా నడుస్తుంది. హ్యాండ్లింగ్ కూడా మెరుగ్గా ఉంటుంది.