హోమ్ లోన్ కోసం సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి?
రుణదాతల ప్రకారం.. గృహ రుణానికి కనీసం 725 లేదా అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోరు అవసరం. ఏదేమైనా, 750- అంతకంటే ఎక్కువ స్కోర్లు ఉంటే, తక్కువ వడ్డీ రేట్లతో ఉత్తమ రుణ నిబంధనలను పొందుతారు. ఇది మంచి సూచిక అయినప్పటికీ, మీ రుణదాత చూసే ఇతర అంశాలు ఉన్నాయి. అవి.. మీ జీతం, వయస్సు, ఉద్యోగ భద్రత, ప్రస్తుత బాధ్యతలు, డౌన్‌పేమెంట్ చేసే మీ సామర్థ్యం. ఇవన్నీ ఎక్కువగా ఉంటే, సాపేక్షంగా తక్కువ స్కోరు ఉన్నప్పటికీ మీకు లోన్ రావొచ్చు.