మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో బీపీసీఎల్‌ గ్రీన్ ఫీల్డ్‌ రిఫైనరీని ఏపీలో ఏర్పాటు చేయడానికి ముందస్తు ప్రాజెక్ట్ కార్యకలాపాలను ప్రారంభించడానికి బోర్డు ఆమోదం తెలిపినట్టు సెబీ, స్టాక్ ఎక్ఛేంజీలకు సమాచారం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు తీరంలో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని రూ. 6100 కోట్లతో చేపడతారు. ప్రీ ప్రాజెక్ట్ కార్యకలాపాలతో పాటు ఇతర అధ్యయనాలు, భూమి గుర్తించడం, భూ సేకరణ, సవివరమైన సాధ్యాసాధ్యాల నివేదిక తయారీ, పర్యావరణ ప్రభావ అంచనా, ప్రాథమిక డిజైన్ ఇంజనీరింగ్ ప్యాకేజీ, ఫ్రంట్ ఎండ్ ఇంజనీరింగ్ డిజైన్ మొదలైనవి చేపడతారని బీపీసీఎల్‌ వివరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here