కండోమ్ ఏ కదా.. ఏదో ఒకటిలే వాడి పారేస్తే అయిపోతుంది అని ఎప్పుడూ అనుకోకూడదట. కండోమ్లలోనూ పలు రకాలు ఉంటాయి. ఒక్కో రకమైన కండోమ్ తో ఒక్కో రకమైన అనుభూతి, ప్రయోజనం పొందవచ్చు. సైన్స్ భాషలో చెప్పాలంటే.. “యోనిలోకి ప్రవేశించిన వీర్యకణాలను అండంతో కలవకుండా అడ్డుకునే రక్షక కవచమే కండోమ్”. అంతేకాకుండా సుఖ వ్యాధులు, హెచ్ఐవీ, క్లామైడియా, గోనోరియా వంటివి రాకుండా అడ్డుకోగలదని వైద్యులు చెబుతున్నారు. జికా, ఎబోలా వంటి లైంగికంగా సంక్రమించే వైరస్ల నుంచి కూడా కాపాడగలుగుతాయట కండోమ్లు.ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన కొత్త విషయం ఏంటంటే..