Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ విచారణ ముగిసింది. సుమారు 3.30 గంటల పాటు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను విచారించారు. తన తండ్రి అల్లు అర్జున్, న్యాయవాదితో కలిసి మంగళవారం ఉదయం 11.05 గంటలకు అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. వీరిలో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాసు ఉన్నారు. ఏసీపీ రమేశ్, ఇన్ స్పెక్టర్ రాజునాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ అల్లు అర్జున్ ను విచారించారు. తొక్కిసలాట ఘటనపై ఇటీవల సీపీ సీవీ ఆనంద్ 10 నిమిషాల వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ఆధారంగా అల్లు అర్జున్ ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం అల్లు అర్జున్ తన నివాసానికి వెళ్లిపోయారు.