హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. చిక్కడపల్లి పీఎస్‌లో విచారణ సాగుతోంది. ఆయనను ఏసీపీ రమేష్, సీఐ రాజు విచారిస్తున్నారు. మొదట అల్లు అర్జున్‌కు 20 ప్రశ్నలతో కూడిన ఓ పేపర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వాటికి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన తర్వాత ఆయనను మరిన్ని ప్రశ్నలు మౌఖికంగా అడిగే అవకాశం ఉండొచ్చు.