Pushpa 2 Box Office Collection: అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటించిన పుష్ప 2 మూవీ హిందీ మార్కెట్ లో అసలు అడ్డూ అదుపు లేకుండా దూసుకెళ్తోంది. తాజాగా 19వ రోజు ఈ మూవీ రూ.700 కోట్ల నెట్ కలెక్షన్ల మార్క్ అందుకుంది. గతంలో ఏ హిందీ సినిమా అందుకోని రికార్డు ఇది. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ ఏడాదే స్త్రీ2 మూవీ రూ.600 కోట్లు అందుకున్న తొలి హిందీ మూవీగా నిలవగా.. ఇప్పుడు పుష్ప 2 ఆ రికార్డును బ్రేక్ చేసింది.
Home Entertainment Pushpa 2 Box Office Collection: పుష్ప 2 హిందీ@ రూ.700 కోట్లు.. బాలీవుడ్ చరిత్రలో...