మనిషిగా ముందుకు సాగాలి
అయితే, మనోజ్ మరణ బాధను తగ్గించుకోడానికి రామాయణం, భగవద్గీత వంటి ధార్మిక గ్రంథాల వైపు మొగ్గు చూపినట్లు వరుణ్ ధావన్ వెల్లడించాడు. “జీవితంలో ఎన్నో జరుగుతుంటాయి. కానీ, ఒక మనిషిగా మనం ముందుకు సాగాలని నేను గ్రహించాను. ఆ సంఘటనలు మనల్ని కలిచివేస్తాయి. అలా అని మీరు అలా స్తబ్దుగా ఉండలేరు. నేను భగవద్గీత, మహాభారతం, రామాయణాలను చదవడం ప్రారంభించాను. ఎందుకంటే నా దగ్గర చాలా ప్రశ్నలు ఉన్నాయి” అని వరుణ్ ధావన్ తెలిపాడు.