అఫ్గానిస్థాన్‌లోని పక్టికా ప్రావిన్స్‌లో పాక్ సైన్యం జరిపిన వైమానిక దాడిలో కనీసం 46 మంది మరణించారని అఫ్గానిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారని డిప్యూటీ అధికార ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రాత్ ధృవీకరించారు. తూర్పు అఫ్గానిస్థాన్‌లోని నాలుగు గ్రామాలు లక్ష్యంగా వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడులకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తిలేదని తాలిబన్ ప్రభుత్వం చెబుతోంది.
Home International అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ చేసిన వైమానిక దాడుల్లో 46 మంది మృతి.. ప్రతీకారం తీర్చుకుంటామన్న తాలిబన్ ప్రభుత్వం-pakistan...