పెంపుడు జంతువులంటే చాలా మంది ఇష్టపడతారు. వారు పెంచుకునే జంతువులు తమ కుటుంబంలోని సభ్యులుగానే భావిస్తారు. వాటికి ఏదైనా జరిగితే తల్లడిల్లిపోతారు. ఎన్నో సంవత్సరాలుగా పెంచుకుంటున్న జంతువు వారి నుంచి దూరమైపోతే ఆ బాధ వర్ణనాతీతం అని చెప్పొచ్చు. కొందరికి ఇది విచిత్రంగా అనిపిస్తుంది. కానీ, వాస్తవానికి అవి మనుషుల పట్ల చూపించే ప్రేమ ముందు మనిషి ప్రేమ ఎందుకూ పనికి రాదని చెప్పొచ్చు. అలాంటి స్వచ్ఛమైన ప్రేమను పొందిన త్రిష ఇప్పుడు దు:ఖంలో మునిగిపోయింది. ఆమె ఇంటిలో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి. 

తన కొడుకుగా భావించే జోరో అనే డాగ్‌ బుధవారం ఉదయం కన్నుమూసింది. దీంతో త్రిష గుండె పగిలిపోయింది. ‘మై లైఫ్‌ హాఫ్‌ జీరో మీనింగ్‌’ అంటూ సోషల్‌ మీడియాలో పంచుకుంది. ఆమెను దగ్గరగా చూసిన వారికి జోరో అంటే ఎంత ఆమెకు ఎంత ప్రేమో తెలుసు. జోరో మరణం తనకు తీరని లోటని, ఆ దు:ఖం నుంచి బయటపడటానికి, తిరిగి తన పనిలో నిమగ్నం కావడానికి చాలా రోజులు పడుతుందని పోస్ట్‌ చేసింది. జోరో గురించి బాగా తెలిసిన హన్సిక దాని మరణం పట్ల తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ త్రిషకు ధైర్యం చెప్పింది. అంతేకాదు, త్రిషకు సన్నిహితులైన ప్రముఖులు కూడా తమ సంతాప సందేశాన్ని పంపారు. అలాగే ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కూడా తమ కామెంట్స్‌ పెడుతూ త్రిషకు సానుభూతిని తెలియజేస్తున్నారు. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here