AP Heavy Rain Alert: నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తర భారతం మీదుగా వెళ్తున్న పశ్చిమద్రోణి.. అల్పపీడనాన్ని, తేమను తనవైపు లాగడానికి ప్రయత్నిస్తోందని ఐఎండి అంచనా వేస్తోంది. తీవ్ర అల్పపీడనం పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ బుధవారం క్రమంగా బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు.