Tollywood Stars Meets CM Revanth Reddy : సంధ్య థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు…అనంతర పరిణామాల మధ్య టాలీవుడ్ సినీ ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతున్నారు. గురువారం ఉదయం ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. టాలీవుడ్ నుంచి ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, ఇతర నిర్మాతలు, దర్శకులు… సీఎంను కలవనున్నారు. ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ హాజరుకానున్నారు. సినిమా పరిశ్రమ సమస్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపునకు ఇకపై అనుమతి ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు విడుదల ఉండడంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.