ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి నుంచి చర్చిల్లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు. మాజీ సీఎం జగన్ ప్రతీ ఏడాది లాగానే ఈ సారి పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి జగన్ ప్రార్ధనల్లో పాల్గొన్నారు. కొద్ది రోజులుగా జరుగుతున్న వివాదాల వేళ తల్లి విజయమ్మతో కలిసి జగన్ పాల్గొన్నారు. దీంతో తల్లికి కొడుకుకి మధ్య తగాదాల సర్దుమనిగినట్లే తెలుస్తుంది.