శ్రీతేజ్ ను పరామర్శించిన జానీ మాస్టర్
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ను కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పరామర్శించారు. బాలుడి ఆరోగ్యంపై వైద్యులను ఆడిగి తెలుసుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీతేజ్ ను పరామర్శించాలని సినీ పరిశ్రమకు చెందిన చాలామందికి ఉందని, కానీ కొన్ని పరిధులు కారణంగా రాలేకపోతున్నారని జానీ మాస్టర్ అన్నారు. డ్యాన్సర్ యూనియన్ తరఫున శ్రీతేజ్‍కు సాయం అందిస్తామని చెప్పారు. శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతుందని, అతడు త్వరలోనే కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. అతని కుటుంబానికి సినీ పరిశ్రమ అండగా ఉంటుందన్నారు. ఈ మేరకు శ్రీతేజ్ కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పామన్నారు.