సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల నష్ట పరిహారం అందింది. ఈ మేరకు పుష్ప 2 మూవీ యూనిట్ ప్రకటించింది. ఇందులో అల్లు అర్జున్ వైపు నుంచి రూ. కోటి, డైరెక్టర్ సుకుమార్ తరపున రూ. 50 లక్షలు, అలాగే ఆ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ రూ. 50 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇవాళ దిల్ రాజుతో కలిసి అల్లు అరవింద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజ్ ను పరామర్శించారు. ఆ తరువాత ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో అల్లు అరవింద్, దిల్ రాజు ఈ వివరాలను వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here