ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(jani master)తనని లైంగిక వేధింపులకి గురి చేసాడని సెప్టెంబర్ 15 న ఆయన దగ్గర వర్క్ చేసిన ఒక లేడీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదు చేయించిన విషయం తెలిసిందే.దీంతో ఫోక్సో చట్టం కింద జానీ మాస్టర్ అరెస్ట్ అవ్వడంతో కొన్ని రోజులు జైలులో ఉన్నాడు.ఆ తర్వాత హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో జానీ మాస్టర్ ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నాడు.తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.జానీ మాస్టర్ లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి చేసినట్టుగా పోలీసులు నిర్దారించి కేసుకి సంబంధించిన ఛార్జ్ షిట్ నమోదు చేశారు.
దీంతో మీడియా ఛానల్స్ లో జానీ మాస్టర్ గురించి రకరకాల కధనాలు ప్రచురితమవుతున్నాయి.వాటిపై జానీ మాస్టర్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేసాడు.అందులో తన అభిమానులని ఉద్దేశించి మాట్లాడుతు మీడియాలో ఏదైతే స్క్రోల్ అవుతుందో,వాటన్నినింటికి నా సమాధానం ఒక్కటే.న్యాయస్థానంలో నాయ్యం జరుగుతుందనే నమ్మకముంది.న్యాయం ఉంది కాబట్టే ఈ రోజు నలుగురితో పని చేసుకుంటూ,నా ఫ్యామిలీతో పాటు తెలిసిన వాళ్లతో హ్యాపీ గా ఉన్నాను.నా అంతరాత్మకి తెలుసు ఏం జరిగిందో.ఆ విషయం దేవుడికి కూడా తెలుసు.న్యాయస్థానంలో నేను క్లీన్ చిట్ తో నిర్దోషిగా బయటకి వస్తాను.
ఆ రోజున అన్ని మాట్లాడతాను.అప్పటి వరకు కేవలం నేను నిందితుడిని మాత్రమే.నాపై మీరు చూపించే ప్రేమ ఎప్పుడు ఇలానే ఉండాలి.ఇలానే ఉంటుంది కూడా.నాకు తెలిసిందల్లా ఒక్కటే నాకు తెలిసిన పనితో బాగా కష్టపడుతుప్రేక్షకులని ఎంటర్ టైన్ చెయ్యడం.ఎప్పుడు కూడా నా కొచ్చే విద్యతో మిమ్మల్ని అలరించడానికే కష్టపడతాను. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మీరు నా పై చూపించే అభిమానమే, ఐ లవ్ యు ఆల్.జై హింద్ అని సదరు వీడియోలో చెప్పుకొచ్చాడు.