మహేష్ బాబు(mahesh babu)త్రివిక్రమ్(trivikram)కాంబోలో తెరకెక్కిన అతడు(athadu)మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపుని సంపాదించిన నటుడు సోనూసూద్.సూపర్,కందిరీగ,అశోక్,ఏక్ నిరంజన్,దూకుడు,జులాయి,అల్లుడు అదుర్స్ వంటి తదితర చిత్రాలతో తన నటనకి ఉన్న  ప్రత్యేకతని చాటి చెప్పాడు.ముఖ్యంగా అనుష్క ప్రధాన పాత్రలో  కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన’అరుంధతి’ లో పశుపతి అనే క్యారక్టర్ ద్వారా స్టార్ స్టేటస్ ని కూడా పొందాడు.

 హిందీలో కూడా చాలా చిత్రాల్లో నటించిన సోను సూద్(sonu sood)రీసెంట్ గా ఒక వెబ్ సైట్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో అయన మాట్లాడుతు దేశంలోనే మంచి పేరున్న వ్యక్తులు  రాజకీయాల్లో నాకు ఉన్నత పదువులు చేప్పట్టే అవకాశాన్ని కలిపిస్తామని చెప్పారు.ఆ పదవుల్లో సిఏం,డిప్యూటీ సిఎం లాంటివి కూడా ఉన్నాయి.రాజకీయాల్లోకి వస్తే పదవితో పాటు ఇల్లు, ఉన్నత స్థాయి భద్రత, ప్రభుత్వ భద్రతతో ఉన్న లెటర్ హెడ్ విలాసాలు ఉంటాయని,ఆ పదవుల్లో ఏదో ఒకటి తీసుకోమన్నారు.కానీ నేను తీసుకోలేదు.ఎందుకంటే డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసం చాలా మంది రాజకీయాల్లోకి వస్తుంటారు.వాటి పట్ల నాకు ఆసక్తి లేదు.ప్రజా సేవ చెయ్యడం కోసమైతే ప్రస్తుతం నేను అదే చేస్తున్నాను. ఎవరికైనా సరే స్వయంగా నేనే సాయం చేస్తున్నాను.ఆ విధంగా స్వేచ్ఛా జీవిగా  ఉంటున్నాను.

ఒక వేళ నేను రాజకీయ నాయకుడుగా మారితే జవాబు తారి వ్యవహరించాల్సి ఉంటుంది.అది నన్ను మరింత భయపడుతుంది.ప్రజాదరణ పొందుతున్న వారు జీవితంలో ఎదగడం ప్రారంభిస్తారు.నిజానికి ఎత్తైన ప్రదేశాల్లో ఆక్సిజన్ ఉండదు.మనం ఎత్తుకి ఎదగాలని కోరుకుంటాం.కానీ అక్కడ ఎంత కాలం ఉంటామనేది ముఖ్యమని చెప్పుకొచ్చాడు.ఇక సోనూ సూద్ మాటలు విన్న అయన అభిమానులైతే సోనూ సూద్ ఆ పదవులకి ఒప్పుకుంటే బాగుండేదని అనుకుంటున్నారు.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here