(1 / 5)
Boxing Day Test Record: ఆస్ట్రేలియాలోని ఐకానిక్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ప్రతి ఏటా బాక్సింగ్ డే టెస్టు జరగడం సహజం. ఈ మ్యాచ్ చూడటానికి తొలి రోజు భారీ సంఖ్యలో ప్రేక్షకులు వస్తుంటారు. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ప్రారంభమైన నాలుగో టెస్టు తొలి రోజు ఏకంగా 87,242 మంది రావడం విశేషం. గత ఐదేళ్లలో ఇదే అత్యధికం.