లైంగిక వేధింపుల కేసులో నార్సింగి పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ స్పందించారు. ఈ కేసులో తాను నిందితుడిని మాత్రమే అని అన్నారు. ఏ తప్పు చేయలేదని, ఆ దేవుడికి తెలుసు అని వ్యాఖ్యానించారు. న్యాయ స్థానంపై తనకి గౌరవం ఉందన్న జానీ మాస్టర్.. నిర్దోషిగా క్లీన్ చిట్ ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు.