జన గణనలో భాగంగానే కుల గణన కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సీడబ్ల్యూసీ సదస్సులో మాట్లాడిన ఆయన..కులగణన చేపట్టడం ద్వారా తెలంగాణ దేశానికే మార్గదర్శిగా ఉందన్నారు. జనాభా దామాషా ప్రకారం పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు.