తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఇవాళ భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా సినీ ప్రముఖుల ముందు ప్రభుత్వం పలు ప్రతిపాదనలు ఉంచినట్లు తెలిసింది. అటు ఈ విషయాన్ని తెలుసుకున్న ఓ వ్యక్తి కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద హల్చల్ చేశాడు. సినిమా పెద్దలను తప్ప సామాన్యుల విషయాలు పట్టించుకోరా అని నిలదీశారు. “సినిమా పెద్దలు కాదు గద్దలు” అంటూ ప్లకార్డ్ పట్టుకున్నాడు.