అనేక నేరాల్లో పోలీసులకు కీలక విషయాలు పట్టించేది వాళ్ల వద్ద ఉన్న శునకాలే. పోలీసుల కళ్లకి కనిపించని నేరాలను సైతం అవి పట్టేస్తాయి. అయితే పోలీసుల వలే వాటికీ పదవీ విరమణ ఉంటుంది. అలా పదవీ విరమణ పొందిన ఓ డాగ్ అనారోగ్యంతో కర్ణాటకలోని కలబురగిలో చనిపోయింది. భావోద్వేగాల మధ్య ఆ కుక్కకు పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ రిటైర్డ్ క్రైమ్ డాగ్ సర్వీసు గురించి మాట్లాడిన పోలీసులు.. 900 కేసుల్లో పాల్గొందని, 11 ఏళ్ల పాటు సేవలు అందించిందని కొనియాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here