FD interest rates: ఫిక్స్ డ్ డిపాజిట్ (FD)లో మీ డబ్బును పెట్టుబడి పెట్టేముందు ఎఫ్డీలపై వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లను పోల్చి చూసుకోవాలి. సాధారణంగా చాలా బ్యాంకులు తక్కువ కాలానికి తక్కువ వడ్డీ, ఎక్కువ కాలానికి అధిక వడ్డీని అందిస్తున్నాయి. ఒక సంవత్సరం కాలపరిమితి గల ఎఫ్ డీ లపై పలు అగ్రశ్రేణి బ్యాంకులు అందించే వడ్డీ రేట్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ వడ్డీ రేట్లలో వ్యత్యాసం పెద్దగా లేనప్పటికీ, 10-20 బేసిస్ పాయింట్ల చిన్న తేడా మొత్తం రాబడిలో గణనీయమైన వ్యత్యాసాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకు రూ.10 లక్షల ఎఫ్డీపై 20 బేసిస్ పాయింట్ల వ్యత్యాసంతో ఏడాదిలో రూ.2,000 అదనపు వడ్డీ లభిస్తుంది. మీరు డబ్బును మూడేళ్ల పాటు ఉంచితే, ఈ అదనపు ఆదా రూ. 6,000 లకు పెరుగుతుంది. డిపాజిట్ మరో రూ.10 లక్షలు పెరిగితే మొత్తం పొదుపు రూ.12,000కు పెరగవచ్చు. దీనికి కారణం అదనంగా లభించే 20 బేసిస్ పాయింట్ల వడ్డీ మాత్రమే.