ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్​ వాహనాలకు ఉన్న డిమాండ్​ని క్యాష్​ చేసుకునేందుకు ఆటోమొబైల్​ సంస్థలు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోటీని తట్టుకునేందుకు సరికొత్త టెక్నాలజీ, సరికొత్త డిజైన్​తో కస్టమర్స్​ని ఈ​ కంపెనీలు ఆకర్షిస్తన్నాయి. ఇక ఇప్పుడు దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హోండా రెండు కొత్త ఎలక్ట్రిక్​ వాహనాలను సిద్ధం చేస్తోంది. హోండా ‘0’ సిరీస్​లో ఇవి భాగంగా ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్) 2025లో ఈ 0 సిరీస్​లోని ఎలక్ట్రిక్ ఎస్​యూవీ, ఎలక్ట్రిక్​ సెడాన్​ కాన్సెప్ట్స్​ని ఆవిష్కరించనున్నట్టు హోండా వెల్లడించింది. ఈ దశాబ్దం చివరి నాటికి బ్రాండ్ ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న 7 0 సిరీస్ ఎలక్ట్రిక్ కార్లలో ఈ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ, సెడాన్ భాగం కానున్నాయి. 2026లో ఇవి ప్రొడక్షన్​ స్టేజ్​కి వెళతాయి. అయితే, కాన్సెప్ట్​ వర్షెన్​ లాంచ్​కి ముందు, ఆటో మేజర్ ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించిన టీజర్​ని విడుదల చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here