దీప్తి మరణానికి ముందు రికార్డు చేసిన వీడియోలో “నా చావుకు అనిల్, ఆయన భార్య అనిత, ఆమె తండ్రి సోమయ్య కారణమని ఆరోపించింది. వారి దగ్గర నాన్న డబ్బు తీసుకుంటే తన మీద నకిలీ కేసు నమోదు చేయించి జీవితాన్ని నాశనం చేశారని వాపోయింది. ఈ కేసుల మీద పోరాడే ఆర్థిక స్తోమత తనకు లేదని, నా మరణంతోనైనా కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. తన చావుకు కారణమైన వాళ్లకు శిక్షపడాలని, మృతదేహాన్ని వైద్య పరిశోధనకు ఇచ్చేయాలని కన్నీరు పెట్టుకుంది. నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.