• పచ్చడి తయారు చేయడానికి ముందుగా ఉల్లికాడలను తీసుకుని శుభ్రంగా గోరు వెచ్చటి నీటితో కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  • తర్వాత కొత్తిమీర ఆకులను కూడా గోరు వెచ్చటి నీటిలో ఉప్పు వేసి చక్కగా కడిగి, సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఉల్లికాడలు పచ్చిమిర్చి, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.
  • మెత్తటి పేస్టులాగే మారిన ఈ మిశ్రమంలోకి కాస్త నిమ్మరసం వేసి బాగా కలపండి.
  • అంతే టేస్టీ అండ్ హెల్తీ ఉల్లికాడల పచ్చడి తయారయినట్లే.
  • పరోటా, రోటీ, దోస లేదా అన్నంతో దీన్ని సర్వ్ చేసుకోవచ్చు.
  • అంతేకాదు మీరు ఈ చట్నీని 4-5 రోజులు ఫ్రిజ్లో నిల్వ చేయవచ్చు.

ఉల్లికాడలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

ఉల్లికాడలు (Spring onions) తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి పచన వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి, ఎందుకంటే వాటిలో ఫైబర్ ఎక్కువ. హృదయ ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తూ, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఉల్లికాడలు విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లతో ఇమ్యూనిటీను పెంచుతాయి, శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించడంలో కూడా ఉపకరిస్తాయి. అవి శరీరంలో ఉన్న విషపదార్థాలను బయటకు తీసే డిటాక్స్ గుణం కలిగి ఉంటాయి. ఉల్లికాడలు మంచి పొటాషియం మూలంగా రక్తపోటు నియంత్రణ, కిడ్నీల పనితీరు మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే, శక్తి పెరిగి, బరువు తగ్గడం కోరుకునే వారికి ఇది అనువైన ఆహారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here