దీప్తి శర్మ 6, రేణుకా సింగ్ 4 వికెట్లు తీసుకున్నారు. వెస్టిండీస్ 38.5 ఓవర్లలో 162 పరుగులకు కుప్పకూలింది. చినెలీ హెన్రీ 61 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా.. షెమైన్ క్యాంప్‌బెల్ 46 రన్స్ చేసింది. మిగతా బ్యాటర్లందరూ విఫలమవడంతో విండీస్ భారీ స్కోరు చేయలేకపోయింది. దీప్తి శర్మ దెబ్బకు విండీస్ బ్యాటర్లు విలవిల్లాడారు.