నితీష్ కుమార్ రెడ్డి రూ.25 లక్షల నజరానా
ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించిన క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్ అభినందనలు తెలిపారు. ఏసీఏ తరుఫున యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి 25 లక్షల నగదు ప్రకటించారు. త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రోత్సాహక నగదు బహుమతిని నితీష్ కుమార్ రెడ్డికి అందిస్తామని తెలిపారు. ఏపీకి చెందిన నితీష్ కుమార్ రెడ్డి భారత క్రికెట్ టీమ్ తరఫున ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడేందుకు ఎంపిక కావటం శుభపరిణామం అన్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో ఆల్ రౌండర్ గా నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా రాణిస్తున్నారన్నారు. నితీష్ కుమార్ రెడ్డి లాంటి యువ క్రికెటర్లను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, నేటి యువతకు నితీష్ కుమార్ రోల్ మోడల్ అన్నారు.