ప్లాన్ ఇలా..
రంగరాజుకు రెండెకరాల 40 సెంట్ల పొలం ఉంది. ఇద్దరు కుమార్తెలకు అరెకరం చొప్పున రాసిచ్చారు. మిగిలిన భూమి, తల్లి పేరుమీద ఉన్న ఇంటి కోసం వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో.. శ్రీధర్‌వర్మ, రేవతి కలిసి ఆ ఆస్తిని కాజేయడానికి కుట్ర పన్నారు. అక్క భర్త అప్పులపాలై పరారవడం, అప్పులవాళ్లు ప్రశ్నించడం వంటివన్నీ ఎవరో చేసిన చేతబడి కారణంగా జరుగుతున్నాయని నమ్మించే ప్రయత్నం చేశారు. అప్పులిచ్చిన వారు శవాన్ని కూడా పంపుతారంటూ భయపెట్టారు.